ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని టీడీసీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరు మండలంలోని తారాపురంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే అభివృద్ధి ఏంటో చూపించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు రెండు కళ్లు లాంటివని స్పష్టం చేశారు.