జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఏఐకేఎస్ జిల్లా నాయకులు కలెక్టర్ రంజిత్ భాష కు శనివారం వినతి పత్రం అందజేశారు. కొర్ర సజ్జ కంది మినుములు ఆముదాలు వేరుశనగ పత్తి మిరప ఉల్లి టమోటా పంటలకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని తెలిపారు. రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంటల పరిశీలన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు.