ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందేలా చూడాలని, ఏ చిన్న పొరపొటు జరిగినా ఉపేక్షించేది లేదని కర్నూలు జిల్లా డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం ఎన్ఆర్ జీఎస్ పరిధిలో వెల్దుర్తిలో నిర్మిస్తున్న వ్యక్తిగత గృహాలు, బింగిదొడ్డిలో చేపట్టిన పండ్ల మొక్కల పెంపకం, నీటి తొట్లను పరిశీలించి, మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.