గోనెగండ్లలో వైద్య సిబ్బంది మంగళవారం డెంగ్యూపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కార్తీక్ డాక్టర్ రజిని మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండగా చెత్త చెదారం కొబ్బరి బోండాలు లాంటి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచుకోకుండా జాగ్రత్త వహించాలన్నారు. దోమతెరలను ఉపయోగించి మలేరియాను తరిమికొట్టాలన్నారు.