ఎమ్మిగనూరులోని స్థానిక సొగనూర్ రోడ్డు సమీపాన వెలసిన శ్రీశ్రీశ్రీ వజ్రా అభయ ఆంజనేయ స్వామి దేవాలయం..వద్ద శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్నికాపాడటానికి చెట్లు ప్రధాన భూమికను పోషిస్తాయన్నారు. ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది,శానిటేషన్ సెక్రటరీ, సిబ్బంది పాల్గొన్నారు.