ఆదోని: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం

59చూసినవారు
ఆదోని: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం
ఆదోనిలో పత్తి రైతులకు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూడు రోజుల సెలవు అనంతరం శుక్రవారం కొనుగోళ్లను ప్రారంభించింది. ఒక్కరోజే కొనుగోలు చేసి శని, ఆదివారంతో పాటు సోమవారం అమావాస్య కావడంతో మళ్లీ మూడు రోజుల కొనుగోళ్లను నిలుపుదల చేయనున్నారు. మార్కెట్లో మద్దతు ధర కంటే పత్తికి తక్కువ ధర పలుకుతుంది. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని పత్తి రైతులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్