ఆదోనిలో నూతన కోర్టు భవన నిర్మాణం వచ్చే ఏడాది ఆగస్టులోగా పూర్తి చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది సూచించారు. మంగళవారం ఆదోనిలో పర్యటించి, కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సబ్ జైలును పరిశీలించి, ఖైదీలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఖైదీలను మాట్లాడడానికి వచ్చే వారి వివరాలు, హాజరు పట్టికను పరిశీలించి, ఖైదీలకు ఇబ్బందులు వస్తే మండల న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలన్నారు.