ప్రజలు వారి ఆస్తులను వారానికి ఒకసారైన ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఆదోనిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో ఆస్తి కాజేసిన ఘటనపై మాట్లాడారు. ఆదోనిలో రోజుకో సంఘటనలు జరుగుతున్నాయని, ప్రజలు మార్పు కోరుతున్నారు, కానీ ఇలాంటి మార్పులు కాదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి మార్పులు వస్తామని ప్రజలు ఊహించలేదన్నారు.