ఆదోని డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన 199 మంది అభ్యర్థులకు సోమవారం నిర్వహించనున్న ఇంటర్వ్యూల ప్రక్రియ వాయిదా పడింది. రెవెన్యూ సదస్సుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఇంటర్వ్యూల తేదీ త్వరలో ప్రకటించబడుతుందని వారు వెల్లడించారు.