ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మనోజ్ రెడ్డి కుమారుడు అవినీతి, అరాచకలను సహించలేక ప్రజలు ఓడించారని కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప అన్నారు. శనివారం ఆయన ఆదోనిలో మాట్లాడారు. వైసీపీ హయాంలో రైతులను నిండా ముంచి నేడు విద్యుత్ చార్జీలను తగ్గించాలని ధర్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పది దఫాలు విద్యుత్ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారని అన్నారు.