ఆదోని మండలంలోని గ్రామాల్లోని రైతులకు ఉపాధి పనులు కల్పించి వలసలను నివారించాలని సీపీఎం నాయకులు లక్ష్మన్నలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆదోని మండల కార్యాలయానికి వచ్చిన పీడీ నాసరరెడ్డిని కలిసి మాట్లాడి, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. అలాగే పాండవగల్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఈరమ్మను కొనసాగించాలని గ్రామస్తులు పీడీని కోరారు.