ఆదోని మండలం బసాపురం సమ్మర్ స్టోరేజ్ పరిస్థితి అధ్వానంగా ఉందని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిరామ్ సోమవారం తెలిపారు. ఆదోనికు సరఫరా అవుతున్న నీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నిల్వ ఉందన్నారు. రానున్న ఎండాకాలంలో ఆదోనికి పది రోజులకు ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితి వస్తుందని, పూర్తిస్థాయిలో నింపేందుకు కూడా చెరువుకట్ట శిథిలావస్థలో ఉందని ఇలా అయితే ఎండాకాలంలో ఎద్దడి తప్పదన్నారు.