ఆదోని: అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మరో ఇద్దరు అరెస్టు

85చూసినవారు
ఆదోని: అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మరో ఇద్దరు అరెస్టు
ఆదోని పట్టణంలోని టూటౌన్ పోలీసులు మంగళవారం నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్‌తో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన ఇద్దరు సాక్షులను అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ సూర్యమోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై 10 మందిపై కేసు నమోదు చేసి, ఇప్పటికే 6 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. కాగా సాక్షులైన ఈరన్న, లోకనాథరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్