ఘనంగా కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

82చూసినవారు
ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండల కేంద్రంలో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయములో అమ్మవారి జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పుల్లేటికుర్తి రాధాక్రిష్ణ ఆధ్వర్యములో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పూజారి నరసింహ శాస్త్రి ఆధ్వర్యములో అమ్మవారికి ఉభయదారులచేత పంచామృత అభిషేకం , నవగ్రహ లఘుజపము కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహమంగల హారతి సమర్పించారు.

సంబంధిత పోస్ట్