రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితాను విడుదల చేసినట్లు ఆలూరు అసిస్టెంట్ ఎలక్టరోల్ ఆఫీసర్ గోవింద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితా ప్రకారం నియోజకవర్గంలోని 294 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 2,60,213 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో పురుషులు 1,30,633 మంది, మహిళలు 1,29,528 మంది ఉండగా, 52 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని చెప్పారు.