తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఆలూరులో మాట్లాడారు. ప్రభుత్వం, టీటీడీ మధ్య సరైన చర్చలు లేకపోవడంతోనే ఘటన జరిగిందని విమర్శించారు. ఒక అవగాహన లేని వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ కట్టబెట్టడం, ప్రచార పిచ్చి వల్ల పేద ప్రజల ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై బాధ్యత వహించాలన్నారు.