ఆస్పరి మండలం ముత్తుకూరులో దారుణం జరిగింది. బుధవారం మతిస్థిమితం లేని ఓ మహిళ (35)పై జోగి హనుమంతు అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడినట్లు ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళను ఆశ్రమంలో విడిచిపెడతానని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళ్లి, ఆశ్రమానికి తీసుకెళ్లకుండా, ముత్తుకూరులోని తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.