రీసర్వేలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. శనివారం హొళగుంద మండలంలోని నాగరకన్విలో గ్రామ సభకు హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు ఆయా గ్రామాల్లోనే పరిష్కరించేందుకే గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం రైతుల నుంచి అర్జీలు తీసుకున్నారు. సులువాయి, హొళగుందలోని నాన్ అగ్రికల్చర్ స్థలాలను పరిశీలించారు.