ఆలూరు: పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

66చూసినవారు
ఆలూరు: పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఆలూరు మండలం చిన్నహోతూరుకు చెందిన బోయ శేఖర్ అనే వ్యక్తి ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, స్థానికులు శేఖర్ ను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తికి భార్య, కూతురు ఉన్నారు. ఆత్యహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్