ఆలూరు: వేదావతి నదిపై ప్రాజెక్టు పనులను ప్రారంభించాలి

79చూసినవారు
హాలహర్వి మండలం గూళ్యం వద్ద నిర్మించతలపెట్టిన వేదావతి నదిపై ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఆలూరులో సీపీఎం కార్యదర్శి షాకీర్ నేతృత్వంలో అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, మాట్లాడారు. వేదవతి ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రాజెక్టు నిర్మాణంలో పొలాలు కోల్పోయిన రైతులకు రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్