ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలోని ముత్తుకూరు గ్రామంలో జోగి హనుమంతు (35) అనే వ్యక్తి ఈనెల 17వ తేదీన మతిస్థిమితం లేని మహిళను ఇంట్లో నిర్భంధించి అత్యాచారం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలోని ఘటనా స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐ మస్తాన్ వలి సందర్శించి, విచారణ చేపట్టారు. గ్రామస్తులతో మాట్లాడి, వివరాలు సేకరించారు.