దేవనకొండ మండలంలో సీజనల్ వ్యాధుల పట్ల ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదోని డిప్యూటీ డీఎంహెచ్ ఓ డాక్టర్ సత్యవతి అన్నారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వైద్య సిబ్బంది సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆశా, ఏఎన్ఎం లకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల గూర్చి తగు సూచనలు ఇచ్చారు.