నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉన్నత పాఠశాలలో నియమితులైన ఒకేషనల్ ఉపాధ్యాయులచే విద్యార్థులకు ఒకరోజు ద్విచక్ర వాహన మెకానిజంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిప్పగిరి మండల పరిధిలోని నెమకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు గురువారం ఆలూరు లోని హీరో మోటార్ సైకిల్ షో రూమ్ లో ఒకేషనల్ టీచర్ రామకృష్ణ విద్యార్థులకు 2 వీలర్ మెకానిజంపై శిక్షణ అందించి మరమత్తులు వివరించారు.