హాలహర్వి మండలంలో కొన్ని రోజులుగా వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కురవడంతో హాలహర్వి నుంచి గూళ్యం వెళ్లే రహదారిలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు అరగంటకు పైగా నిలిచిపోయాయి.