కర్నూల్-బళ్లారి ప్రధాన రహదారిపై సోమవారం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా దేవనకొండ మండలం ఈదుల దేవరబండలో 2 వేల మందికి పైగా ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనతో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. 20 మంది ఎస్ఐలు, వంద మంది పోలీసులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించినా ప్రజలు ఆందోళన విరమించలేదు. యురేనియం తవ్వకాలు ఆపాలని నినదిస్తున్నారు.