ఆలూరులో రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

76చూసినవారు
ఆలూరులో రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ఆలూరు నుంచి కర్నూలుకు వెళ్లే రోడ్డు మరమ్మత్తు పనులను వైసిపి ఎమ్మెల్యే విరుపాక్షి ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్