భవిష్యత్తు తరాల కోసం నీటిని పొదుపు చేద్దాo

77చూసినవారు
భవిష్యత్తు తరాల కోసం నీటిని పొదుపు చేద్దాo
భవిష్యత్తు తరాల కోసం నేటి నుండి నీటిని పొదుపుగా వాడుకోవాలని చిప్పగిరి మండల పరిధిలో నేమకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్ద నాగన్న విద్యార్థులకు సూచించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి బాలస్వామి ఆధ్వర్యంలో స్తానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సేవ్ ది వాటర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు గ్రామపంచాయతీ సిబ్బంది గురువారం వకృత్వ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్