చుండ్రు సమస్యకు మునగాకుతో చెక్‌!

68చూసినవారు
చుండ్రు సమస్యకు మునగాకుతో చెక్‌!
కేశాల క్లేశాలు తొలగించడంలో మునగ ముందుంటుంది. మునగాకులో జింక్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు సంరక్షణకు దోహదం చేస్తుంది. చుండ్రు సమస్యకు కూడా మునగ చెక్‌ పెడుతుంది. కప్పు గోరువెచ్చని నీటిలో మునగాకు పొడివేసి పేస్టులా చేసుకోవాలి. ఇందులో అలోవేరా గుజ్జు వేసి బాగా కలపాలి. దీనిని జుట్టుకు దట్టంగా పట్టించి, అరగంట తర్వాత షాంపూతో తల స్నానం చేస్తే.. కురులు మెత్తగా తయారవుతాయి. కుదుళ్లు బలంగా మారుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్