తుంగభద్ర డ్యాంకు 30, 370 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

545చూసినవారు
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గిందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు సోమవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువన వర్షాలు తగ్గడంతో 30, 370 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 98. 02 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. వివిధ కాల్వలకు, నదికి 15, 132 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్