ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా: వైసీపీ జిల్లా కమిటీ

61చూసినవారు
ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా: వైసీపీ జిల్లా కమిటీ
దేవనకొండ మండలం తెర్నేకల్లోని ఎల్లమ్మపేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని వైసీపీ జిల్లా కమిటీ కోశాధికారి కొత్తకాపు మధుసుధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలోని ఎల్లమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనతో కలిసి మాట్లాడారు. నూతన గోపుర నిర్మాణానికి రూ. 80, 000 విలువ చేసే ఇటుకలను అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు హనుమన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్