విద్యుత్ ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు సంజామల ఎస్సై డి. రమేశ్ రెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై సంజామల పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది. ఆకుమళ్లకు చెందిన షేక్ నబీరసూల్(55) గ్రామానికి చెందిన రామయ్య వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు సవరించేందుకు ట్రాన్స్ఫార్మర్ ఎక్కి విద్యుత్ తీగలు సవరిస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం తగలడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు.