విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 30 లక్షల చెక్కును రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి నంద్యాల మ్యుటువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ (జిల్లా మహిళా సమాఖ్య) అందజేశారు. మంగళవారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన కార్యక్రమంలో, మంత్రి బీసీ డ్వాక్రా మహిళా సంఘాల తరపున ఈ చెక్కును అందించారు.