Feb 12, 2025, 10:02 IST/
సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు లైన్ క్లియర్.. ఈ ఏడాది లేనట్లే!
Feb 12, 2025, 10:02 IST
సర్పంచ్ ఎన్నికలపై మరో అప్డేట్ వచ్చింది. తెలంగాణలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవమైన చోట 'నోటా'తో ఎన్నిక నిర్వహించాలనే ప్రతిపాదన ఈసారి అమలులోకి రావడం లేదని తెలుస్తోంది. నోటాను కల్పిత అభ్యర్థిగా పెట్టాలన్న EC నిర్ణయానికి పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. దీంతో, ఈసారి ఎన్నికల్లో ఏకగ్రీవమైన స్థానాల్లో నోటాతో ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.