అసత్య ఆరోపణలు మానుకోవాలి

84చూసినవారు
అసత్య ఆరోపణలు మానుకోవాలి
ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నిజానిజాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పై ఆరోపణలు చేయడం తగదని మాజీ ఎంపీపీ టి. శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్యాపిలి పట్టణంలోని కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. గతంలో నియోజకవర్గంలో చేపట్టిన అభి వృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని, అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్