బేతంచర్ల పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం ఐసిడిఎస్ సిడిపిఓ శంషాద్ బేగం ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డోన్ సివిల్ జడ్జ్ తంగమని, సీనియర్ న్యాయవాదులు గోపాల్ రెడ్డి, ఎం. కుమారి లు మహిళలకు చట్టాలు, హక్కులు, న్యాయ సహాయం పొందడానికి సమర్థమైన మార్గాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, కమిషనర్ హరిప్రసాద్, ఎంపీడీవో ఫజల్ రహీమాన్, ఎంఈఓ సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.