డోన్ మండలంలోని కోట్లవారిపల్లె మూడు రోడ్ల కూడలిలో బుధవారం సీపీఎం మండల కార్యదర్శి కోయలకొండ నాగరాజు నేతృత్వంలో కరెంట్ బిల్లులు దహనం చేసి నిరసన తెలిపారు. అధికారం వచ్చిన ఆరు నెలలకే విద్యుత్ చార్జీలు పెంచడాన్ని ఖండిస్తూ, ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం తగదని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం, మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టడం దురదృష్టకరమని అన్నారు.