ప్రస్తుత సమాజంలో మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అని డోన్ సివిల్ కోర్టు జడ్జి ఎస్ తంగమణి శనివారం అన్నారు. బేతంచెర్ల మండల కేంద్రంలోని నగర పంచాయతీ కార్యాలయం నందు నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్, మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం సిడిపిఓ శంషాద్ బేగం ఆధ్వర్యంలో శనివారం నాడు నిర్వహించారు. ప్రస్తుతం సమాజంలో మహిళలల కొరకు ఎన్ని చట్టాలు ఉన్నా మహిళలకు రక్షణ కరువైందని అన్నారు.