ఉపాధి నిధులతో జిల్లాలో అప్రోచ్ రోడ్లు

78చూసినవారు
ఉపాధి నిధులతో జిల్లాలో అప్రోచ్ రోడ్లు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో అప్రోచ్ రోడ్లు కూడా వేయడానికి రంగం సిద్ధమైంది. మొదటిగా ఉపాధి నిధులతో జిల్లాలోని 21 మండలాల్లో సీసీరోడ్లు వేయడానికి శుక్రవారం కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా పరిపాలన అనుమతులు ఇచ్చారు. కాగా రూ. 14 కోట్ల ఉపాధి నిధులతో అప్రోచ్ రోడ్లు వేయడానికి గ్రామీణావృద్ధి శాఖ ఆదేశాలు ఇచ్చింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీవోలను కోరింది.

సంబంధిత పోస్ట్