కోడుమూరు మండలంలోని లద్దగిరి శివారులో ఓటుకుంట వాగు దాటుతూ శుక్రవారం ప్రమాదవశాత్తు 50 గొర్రెలు మృతి చెందాయి. కొండాపురం, లద్దగిరి గ్రామాలకు చెందిన గొర్రెల కాపరులు సుమారు 2 వేల గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఒక పొలం నుంచి మరొక పొలానికి వెళ్తుండగా వాగు దాటాల్సి వచ్చింది. గొర్రెలు నీళ్లు తాగుతుండగా ఆ వెనుకనే వచ్చిన గొర్రెలు నీళ్లు తాగేవాటిపై పడి చనిపోయాయి. రూ. 8 లక్షల నష్టం వాటిల్లిందన్నారు.