టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు పోసాని క్రిష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోడుమూరులో టీడీపీ నాయకులు ఎల్లప్ప నాయుడు, భాస్కర్ అన్నారు. గురువారం కోడుమూరు పోలీసు స్టేషన్ లో పోసాని పై ఫిర్యాదు చేశాడు. సమాజంలో గౌరవప్రదమైన స్థితిలో ఉన్న బీఆర్ నాయుడితోపాటు సీఎంపై పోసాని బూతులతో కూడిన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.