కోడుమూరు: బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటాం: ఎంఈవో

63చూసినవారు
కోడుమూరు: బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటాం: ఎంఈవో
సి. బెళగల్ మండలంలో బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి జ్యోతి హెచ్చరించారు. సోమవారం మండలంలోని పోలకల్లు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మాదక్క ఆధ్వర్యంలో మహిళలతో సమావేశం నిర్వహించి, ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలపై మండలంలో ప్రత్యేక టీమును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్