కర్నూలు: నగర అభివృద్ధికి రూ. 3. 81 కోట్లు ఖర్చుకు ఆమోద ముద్ర

84చూసినవారు
కర్నూలు: నగర అభివృద్ధికి రూ. 3. 81 కోట్లు ఖర్చుకు ఆమోద ముద్ర
కర్నూలు నగరంలో అత్యవసర పనులకు ప్రాధాన్యతనిస్తూ, అన్ని వార్డులకు సమాంతరంగా నిధులు కేటాయిస్తున్నామని నగరపాలక సంస్థ మేయర్ బీవై రామయ్య అన్నారు. గురువారం కర్నూలు నగరపాలక కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. కమిషనర్ రవీంద్రబాబు, విక్రమసింహారెడ్డి, చిట్టమ్మ, క్రాంతి కుమార్, జుబేర్, యూనుస్, హాజరయ్యారు. సాధారణ నిధుల నుంచి రూ. 3, 81, 43, 000 నిధులను ఖర్చు చేయడానికి ఆమోద ముద్ర వేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్