రింగ్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

85చూసినవారు
రింగ్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
కర్నూలు మండలం బి. తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు జరుగుతున్న రింగ్‌ రోడ్డు పనులను నవంబరు 15 నాటికి పూర్తి చేయాలని ఎన్ హెచ్-340సీ పీడీనీ కలెక్టర్‌ పి. రంజిత బాషా ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై నేషనల్‌ హైవే అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. సోమయాజులపల్లె నుంచి డోన్ రూట్‌కు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆర్డీవోను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్