తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆదివారం జేఏసీ నాయకులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల కేంద్రం ఏర్పాటుకు తమ గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు.