సినీ నటుడు అల్లు అర్జున్‌పై తమకు ఎలాంటి కక్ష లేదని, అయినా ఆయన కారణంగా ఓ మహిళ చనిపోతే అరెస్ట్ చేయవద్దా? అని ఆదివారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణమన్నారు. తొక్కిసలాట కారణంగా ఓ పేద మహిళ చనిపోతే చర్యలు తీసుకోవద్దా? అన్నారు. అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగినప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.