తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట నుండి గడ్డమీది తండా వరకు ఉన్న రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని ఆదివారం గిరిజనులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డు వర్షాలకు గుంతలమయంగా మారి అద్వాన్నంగా తయారై రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని వారు కోరారు.