తెలంగాణలో మెగా లోక్ అదాలత్లో 4,893 మంది బాధితులకు రూ.33.27 కోట్లు రిఫండ్ చేసినట్లు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పేర్కొంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు 17,210 మంది బాధితులకు 155.22 కోట్లు రిఫండ్ చేసింది. గత ఏడాది కంటే రూ.27.2 కోట్లు అదనంగా రికవరీ చేశామని.. ఇది ఒక రికార్డ్ అని తెలిపింది.