కొత్తపల్లిలో గ్రామ సభలతో సమస్యలు పరిష్కారం
కొత్తపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభలలో రైతులు భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని తహసిల్దార్ ఉమారాణి డిప్యూటీ తహసిల్దార్ పెద్దన్న తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన కొత్తపల్లిలో గ్రామసభ ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక గ్రామసభలను ఏర్పాటు చేసిందన్నారు. మండల సర్వేర్ విలేజ్ సర్వే వీఆర్వోలు రైతులు పాల్గొన్నారు.