కుందూ, పాలేరు వాగుకు వరద ఉద్ధృతి
కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తి గ్రామ శివారులోని కుందూనది, సంజామల మండల కేంద్రంలోని పాలేరు వాగుకు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో డ్యామ్ నిండుకుండలా ప్రవహిస్తోంది. అటు ప్రధాన కాలువలు, వంకలు, వాగులకు కూడా వరద నీరు భారీగా చేరింది. దీంతో జలకళ సంతరించుకున్నది.