జీతానికి బయోమెట్రిక్‌ కు హాజరు సరికాదు : ఎస్ టి యు

852చూసినవారు
జీతానికి బయోమెట్రిక్‌ కు హాజరు సరికాదు : ఎస్ టి యు
నాసిరకమైన, సరిగా నెట్ వర్క్ పని చేయని బయోమెట్రిక్ యంత్రాలతో ఉద్యోగుల జీతాలను ముడి పెట్టడం సరైనది కాదని ఎస్ టి యు కర్నూలు జిల్లా కన్వీనర్లు ఎర్రిస్వామి, సుధాకర్ బాబుల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మండల అధ్యక్షులు బి. శంకర్ అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదు.ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది.

ప్రభుత్వ పథకాలకు ఉపాధ్యాయులను ప్రభుత్వం వినియోగించుకుంటున్న కారణంగా, ఉపాధ్యాయులు తరగతులలో విద్యార్థులకు విద్యను బోధించ లేక పోతున్నారని అన్నారు . ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఎర్రి స్వామి మాట్లాడుతూ... ప్రభుత్వం ఎప్పుడో అమలు చేయాల్సిన పి.ఆర్.సి.ని ఇప్పటికీ కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా పిఆర్సి ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉద్యోగులపై మాత్రం మొండి వైఖరిని ప్రదర్శించడం సరికాదు అని అన్నారు. జిల్లా కన్వీనర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల, ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్ టి యు) నాయకులు బసవరాజు, నీలకంఠ, ప్రశాంతి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్